28 June 2010

ఛ …వాడికి నామీద ప్రేమే లేదు

ఛ …వాడికి నామీద ప్రేమే లేదు
He doesn’t love me you know
No he loves you
He loves you Sooo much
ఔనా ఎంత
ఎంతంటే ఆ….
మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు
కలిగినట్టి కోపమంత
మొదటిసారి నేను మాట్లాడినప్పుడు
పెరిగినట్టి ద్వేషమంత
మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు
జరిగినట్టి దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు
తీరినట్టి భారమంత
ఓ ఇంకా
హో...
తెల్లతెల్లవారి పల్లెటూరిలోన అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న ఆవుపాల నురగంత
చల్లబువ్వలోన నంజుకుంటు తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకొచ్చి తుల్లి ఆడుతున్న ఆడపిల్ల కోరికంత
Baby he loves he you loves you he loves you so much (2)

అందమైన నీ కాలికింద తిరిగే నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తొనికే గాలికున్న గతమంత
చుర్రుమన్న నీ చూపులోన యెగసే నిప్పులాంటి నిజమంత
Baby he loves he you loves you he loves you so much (2)
పంటచేలలోని జీవమంత
ఘంటసాల పాటా భావమంత
పండగొచ్చినా, పబ్బమొచ్చినా, వంటశాలలోని వాసనంత
కుంబకర్ణుడి నిద్దరంత
ఆంజనేయుడి ఆయువంత
కృష్ణమూర్తిలో లీలలంత..రామలాలి అంత
Baby he loves he you loves you he loves you so much (2)
పచ్చివేపపుల్ల చేదు అంత
రచ్చబండపైన వాదనంత
అర్ధమైనా కాకపోయిన భక్తి కంది ?? వేదమంత
యేటి నీటిలోన జాబిలంత
యేట యేట వచ్చె జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో నాటుగోలలంత
Baby he loves he you loves you he loves you so much (2)

ఐసిరె తస్సాదియ్యా... (2)
ఐసిరారె తస్సదియ్య
ఐసిరె తస్సదియ్యా... [2]

అల్లరెక్కువైతె కన్నతల్లివేసే మొట్టికాయ చనువంత
జల్లు పడ్డవేళ పొంగి పొంగి పూసే మట్టి పూల విలువంత
హో..
బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే పిల్లగాడి బెదురంత
లక్ష మందినైన సవాలు చేసే ఆటగాడి పొగరంత
Baby he loves he you loves you he loves you so much
Baby baby he loves he you loves you he loves you too much
ఎంత దగ్గరైన నీకునాకు మధ్య ఉన్న అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి చేరలేని తీరమంత
ఎంత వోర్చుకున్న నువ్వు నాకు చేసే జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానె మార్చే నా తీపి స్నేహమంత
Baby he loves he u loves u he loves you so much
Baby he loves he u loves u
I love u sooo much

No comments: