24 June 2010

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
సీత సర్వమూ రామ పాదము
రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము
కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన

నీలాగ ఒకతుంటే ధర్మరాజు జూదరిగా పేరొందునా
భారతాన యుద్ధమునకు తావుండునా
లోపమంటూ లేనివాడు లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు
తప్పు దిద్దుకున్నవాడె ఆ దేవుడు
నీ సహనానికి నా భాష్పాంజలి
నీ హృదయానికి ఇది పుష్పాంజలి
ఏ దేవుళ్ళు దిగి వచ్చి దీవించినారో నోము పండెను

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన

కన్ను కాచే రెప్ప నీవే
ఆకలైన వేళ అమ్మ లాలింపువే
కన్ను చెమ్మగిల్లు వేళ చెల్లమ్మవే
కంటి చెమ్మ చూడలేని
తోడు నీడ వీడలేని ఇల్లాలిని
జన్మ జన్మనందు నేను నీదానిని
ఈ జగమంతటా నిను తిలకించనీ
నీ సగభాగమై నను తరియించనీ
నా బంగారు కలలన్ని ఫలించి ఇల్లే స్వర్గమైనది

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
సీత సర్వమూ రామ పాదము
రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము
కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన

No comments: