23 June 2010

పూల ఘుమ ఘుమ చేరని ఒ మూల ఉంటే ఎలా

పూల ఘుమ ఘుమ చేరని ఒ మూల ఉంటే ఎలా
తేనె మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా
ప్రేమంటె పామని బెదరాలా
ధీమాగ తిరగక మగరాయడా
భామంటె చూడని వ్రతమేలా
పంతాలె చాలుర ప్రవరాఖ్యుడ
మారనే మారవా
మారమే మానవా
మౌనివా మానువా
తేల్చుకో మానవా

చెలి తీగకి ఆధరమై బంధమై అల్లుకో
దరికొచ్చి అరవిచ్చి అరవిందమై అందమే అందుకో
మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో
నా వాలు జడ చుట్టుకొని మొగిలి రేఖ నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో
సొగసులో పరిమళం స్వాసగా తీసుకో

ప్రతి ముద్దుతో ఉదయించని కొత్త పున్నాగనై
జతలీలలొ అలసి మత్తెక్కిపోని నిద్రగన్నేరునై
నీ గుండెపై ఒదిగుండని పొగడ పూదండనై
నీ కంటి కోనేట కొలువుండి పోనీ చెలిమి చెంగల్వనై
మొజులే జాజులై పొయనీ హయిని
తాపమే తుమ్మెదై తీయని తేనెనీ

No comments: