28 June 2010

ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా

పల్లవి:
ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా
నీకై నేనూ ఆలోచిస్తున్నా
ఏ పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా
నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్ళు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీ కోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్నా
నీ పెదవుల పిలుపుల కోసం పడి చస్తున్నా
నా తనువంతా మనసై ఉన్నా

ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా

చరణం:
రాయని లేఖలు ఎన్నో నా అరచేతుల్లో
ఇంకా చెప్పని సంగతులెన్నో నా ఎద గొంతుల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో
మనసైనా ఆకర్షణలో మునకేస్తున్నా
ప్రియమైనా సంఘర్షణలో పులకిస్తున్నా
నా వయసంత వలపై ఉన్నా
ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా

చరణం:
స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసటలోనా
అర్చన నేనై ఉంటా నీ ఒడి గుడిలోనా
వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకుల్లోనా
నీ జీవన నదిలో పొంగే నీరౌతున్నా
సంతోషం ఉప్పొంగే కన్నీరౌతున్నా
శతజన్మాల ప్రేమౌతున్నా
ఏకాంతంగ ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips