29 June 2010

ఈ వెన్నెల మల్లి విరిపందిరిలోన

ఈ వెన్నెల మల్లి విరిపందిరిలోన
చిరునవ్వుల హారతి రేకులు ఈనా ఆ ఆ ఆ
వెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులీన
పండు వెన్నెల మనసు నిండా వెన్నెల
కొండపైన కోనపైన కురిసే వెన్నెల విరిసే వెన్నెల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మబ్బుల దారి ఓ బాటసారి నీవొంటరి పయణం కాదా
నీ జంటగ నీ సఖి లేదా
మబ్బుల దారి ఓ బాటసారి నీవొంటరి పయణం కాదా
నీ జంటగ నీ సఖి లేదా
నాకై వేచె నవ్వులు పూచె నా చెలి కన్నుల కాచే వెన్నెల
పైన వెన్నెల మనసులోన వెన్నెల
పైన లోన చందమామ పరచే వెన్నెల పాలవెన్నెల

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చల్లని రేయి మెలమెల్లని గాలి
అలనల్లన మమతలు మూగే తియతీయని తలపులు రేగే
అలనల్లన మమతలు మూగే తియతీయని తలపులు రేగే
తీయని వలపులు తెచ్చేదెవరు నాకై పరుగున వచ్చేదెవరు
పండు వెన్నెల మనసు నిండా వెన్నెల
కొండపైన కోనపైన కురిసే వెన్నెల విరిసే వెన్నెల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

No comments: