22 June 2010

ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ

ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత చాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత చాయ
ముద్దు మురిపాలలొలొకు ముంగిళ్ళలోన మూడుపువ్వులు ఆరుకాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో చాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత చాయ

ఆరన్యిదోతనము ఏ చోట్నుండి అరుగులలికేవారి అరచేతనుండు
ఆరన్యిదోతనము ఏ చోట్నుండి అరుగులలికేవారి అరచేతనుండు
తీరయిన సంపద ఎవరింటనుండు
తీరయిన సంపద ఎవరింటనుండు
దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు

ముత్యమంత

కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరికొలిచేవారి కొంగుబంగారు
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరికొలిచేవారి కొంగుబంగారు
గోవుమాలక్ష్మికి కోటి దండాలు
గోవుమాలక్ష్మికి కోటి దండాలు
కోరినంతపాడి నిండు కడవల్లు

ముత్యమంత

మగడు మెచ్చినచాన కాపురంలోన మొగలిపూలాగాలి ముత్యాల వాన
మగడు మెచ్చినచాన కాపురంలోన మొగలిపూలాగాలి ముత్యాల వాన
యింటి యిల్లాలికి ఎంత సౌభాగ్యం
యింటి యిల్లాలికి ఎంత సౌభాగ్యం
యింటిల్లిపాదికి అంతవైభొగం

ముత్యమంత

No comments: