24 June 2010

సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం

సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

పచ్చని వృక్షములలరారు బంగరు పైరులు కనరారు

మాయని సిరులే సమకూరు వేలాంగణ్ణి అను ఊరు
సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

విరితావులను వెదజల్లి వీచే చల్లని చిరుగాలి

ఆవుదూడల ప్రేమగని పాడెను మమతల చిన్నవని
సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

మట్టిని నమ్మిన కర్షకులు మాణిక్యాలు పొందేరు

కడలిని నమ్మిన జాలరులు ఘన ఫలితాలు చెందేరు
కడలిని నమ్మిన జాలరులు ఘన ఫలితాలు చెందేరు
సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

పాలుతేనై కలిసారు అనురాగములో దంపతులు
పాలుతేనై కలిసారు అనురాగములో దంపతులు
తోడునీడై మెలిగారు చవిచూసారు స్వర్గాలు
సాగరతీర సమీపాన తరగని కావ్య సుధామధురం
కాలచరిత్రకు సంకేతం కరుణకు చెరగని ప్రతిరూపం

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips