28 June 2010

ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టావేస్తావు

పల్లవి:
ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టావేస్తావు
ఆ ముడి ఒక కొంగు ముడి అయ్యేదాకా ఊరుకోవు ప్రేమా
||ఒక మనసుతో||

చరణం:
పసిపాపలో ముసినవ్వులా కపటాలు లేని ప్రేమా
మునిమాపులో మరుమల్లెలా మలినాలులేని ప్రేమ

అరచేతిలో నెలవంకలా తెరచాటులేని ప్రేమా
నదిగొంతులో అల పాటలా తడబాటులేని ప్రేమ

మనసులు కలివిడి ఫలితం ప్రేమా
తనువుల తాకిడి కాదు సుమా
అనంత జీవయాత్రలోన తోడు ప్రేమా
ప్రేమా.....

||ఒక మనసుతో||

చరణం:
అధరాలలో తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమా
హృదయాలలో ధృవతారలా అలరారుతుంది ప్రేమా

పరువాలతో కరచాలనం చేసేది కాదు ప్రేమా
ప్రాణాలలో స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమా
మమతల అమృతవర్షిణి ప్రేమా
కోర్కెల అలజడి కాదు సుమా
నిశీధిలోను వీడిపోని నీడ ప్రేమా
ప్రేమా....

||ఒక మనసుతో||

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips