22 June 2010

వ్రేపల్లె వేచెను ..వేణువు వేచెను

వ్రేపల్లె వేచెను ..వేణువు వేచెను
వనమెల్లా వేచెనురా ..ఆ
నీ రాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచెనురా
రావేలా రావేలా

1|| కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని
గున్న మావి పూయనన్నది నీవు రావని
కాటుక కన్నీటి జాలుగ..జాలి జాలి గా
కదలాడె యమునా నది
నీ రాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచెనురా
రావేలా రావేలా

2|| మా వాడ అంటున్నది స్వామి వస్తాడని
నా నీడ తానన్నది రాడు రాడెమని
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా |ర
రావేలా చిరుజల్లుగా
నీ రాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచెనురా
రావేలా రావేలా

No comments: