22 June 2010

ఆనంద తాండవ మాడే - శివుడు

ఆ..ఆ..ఆ..
ఆనంద తాండవ మాడే - శివుడు
అనంతలయుడు - చిదంబర నిలయుడు
నగరాజ సుత - చిరునగవులు చిలుకంగ
సిగలోన ఒగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ

ప్రణవ నాదం ప్రాణం కాగా - ప్రకృతి మూలం తానం కాగా
భువనములే రంగ భూమికలు కాగా
భుజంగ భూషణుడు - అనంగ భీషణుడు
పరమ విభుడు - గరళధరుడు
భావ రాగ తాళ మయుడు సదయుడు

ఏమి శాంభవ లీల - ఏమి తాండవ హేల
అణువణువులోన దివ్యానంద రసడోల
సుర గరుడులు - ఖేచరులు - విద్యాధ్రులు
నిటల తట ఘటిత - నిజకరకములై
నిలువగా - పురహరాయని పిలువగా -కొలువగా

కిణకిణ కిణ కిణ మణి నూపురముల ఝణత్కారములు మ్రోయగా
ధిమి ధిమి ధిమి ధిమ డమరుధ్వానము
దిక్తటముల మార్మోయగా
విరించి తాళము వేయగా - హరి మురజము మ్రోయింపగా
ప్రమధులాడగా అప్సరలు పాడగా - ఆడగా _ పాడగా

No comments: