23 July 2010

దొరకునా దొరకునా దొరకునా

పల్లవి:

దొరకునా దొరకునా దొరకునా
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

చరణం1:

రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
రాగాలనంతాలు నీవేయి రూపాలు
భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే ఆ ఆ ఆ ఆ అ ఆ
ఆఆఆ నాదత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నిను కొల్చువేళ దేవాది దేవ దేవాది దేవ ఆ ఆ ఆ ఆ అ ఆ

దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ


చరణం2:

ఊచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
ఊచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ
మహానుభావా మహానుభావా

దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
దొరకునా ఇటువంటి సేవ

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips