23 July 2010

తీరని నా కోరికలె తీరెను ఈరోజు

పల్లవి:

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

చరణం1:

తరుణలలో నా సరి జాణ
సరసుల నీకు సరి లేరు నెరజాణ
తరుణలలో నా సరి జాణ
సరసుల నీకు సరి లేరు నెరజాణ
ఆటలపాటలలో వినోదాల వేడుకలో
ఆటలపాటలలో వినోదాల వేడుకలో
వాటముగా నిన్ను లాలింతురా దొర
వాటముగా నిన్ను లాలింతురా దొర

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

చరణం2:

వన్నెల మేడ వెన్నెల నీడ
వాడని మల్లియల వాడలలో హాయిగా
వన్నెల మేడ వెన్నెల నీడ
వాడని మల్లియల వాడలలో హాయిగా
వింతలు చేయుదురా విలాసాల తేలుదురా
వింతలు చేయుదురా విలాసాల తేలుదురా
చూతుమురా స్వర్గవైభోగమే ఇలా
చూతుమురా స్వర్గవైభోగమే ఇలా

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips