22 July 2010

ఓ ఓ సంగీత సాహిత్యమే మేమే

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
సంగీత సాహిత్యమే మేమే
నవశృంగార లాలిత్యమే మేమే
సంగీత సాహిత్యమే మేమే
నవశృంగార లాలిత్యమే మేమే
రాగానికి లాస్యం చేసి
భావానికి జీవం పోసి
రాగానికి లాస్యం చేసి
భావానికి జీవం పోసి
నాట్యాన లోకాలేలేము
మాసరి మేమేగా
సంగీత సాహిత్యమే మేమే
నవశృంగార లాలిత్యమే మేమే

చరణం1:

కాకతి సామ్రాజ్య లక్ష్మి రుద్రమ్మదేవి అరిభయంకర కడ్గధారణే నేను
అలనాటి పలనాటి వరబాలచంద్రుల శౌర్యప్రతాపాల సారమే నేను
ననుమించి నన్నొచంగల వీరులెవరు
పరమ మాహేశ్వరుడు పాల్గురితోమన్న పలుకులల్లిన వీరగాధలే నేను
మురిపించు శృంగారి మువ్వపురి క్షేత్ర్యయ్య పదకవితలో మధురభావమే నేను
కవి కోకిలల మంజుగానమే నేను
కవి సింహముల చండగర్జనే నేను

చరణం2:

నవ్యభావాల్ జీవనదులుగా ఉప్పొంగ మణులు పండే తెలుగు మాగాణమే మేము
జాణు తెనుగే మనము జాతి ఘనతే మనము
జాణు తెనుగే మనము జాతి ఘనతే మనము
ఇక దిగ్విజయ యాత్ర సాగించమా
జగమెల్ల మార్మోగ జయభేరి మ్రోగించమా
జయభేరి జయభేరి జయభేరి మ్రోగించమా

No comments: