23 July 2010

రాగం తానం పల్లవి

పల్లవి

రాగం తానం పల్లవి
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి

నాద వర్తులై వేద మూర్తులై
నాద వర్తులై వేద మూర్తులై
రాగ కీర్తులై త్రిమూర్తులై
రాగం తానం పల్లవి

చరణం 1:

కృష్ణా తరంగాల సారంగ రాగాలు ,కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
కృష్ణా తరంగాల సారంగ రాగాలు ,కృష్ణలీలా తరింగిణీ భక్తి గీతాలు
సస్యకేదారాల స్వరస గాంధారాలు
సస్యకేదారాల స్వరస గాంధారాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
సరసహృదయ క్షేత్ర విమల గాంధర్వాలు
క్షీర సాగర శయన దేవ గాంధారిలొ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
క్షీర సాగర శయన దేవ గాంధారిలొ
నీ పద కీర్తన సేయగ ప మా ప ద ని

రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి

చరణం 2:

శ్రుతి లయలే జననీ జనకులుకాగ భావాల రాగాల తాళాల తేలి
శ్రుతి లయలే జననీ జనకులుకాగ భావాల రాగాల తాళాల తేలి
శ్రీ చరణ మందార మధుపమునై వ్రాలి
శ్రీ చరణ మందార మధుపమునై వ్రాలి
నిర్మల నిర్వాణ మధుధారలే బ్రొలి
నిర్మల నిర్వాణ మధుధారలే బ్రొలి
భరతాభి నయవేద ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ
భరతాభి నయవేద వ్రత దీక్షబూని
కైలాస సదన కాంభొజి రాగాన
కైలాస సదన కాంభొజి రాగాన
నీ పద నర్తన సేయగ ప దా ని

రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడతేరమన్నవి
రాగం తానం పల్లవి

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips