23 July 2010

ఒక మెరుపల్లే మెరిసావు నీవెవరివో

పల్లవి:

ఒక మెరుపల్లే మెరిసావు నీవెవరివో
నా ఎద దోచుకున్నావు నీవెవరివో
ఒక మెరుపల్లే మెరిసావు నీవెవరివో
నా ఎద దోచుకున్నావు నీవెవరివో

దేవులపల్లి కవితవో యండమూరి నవలా నాయిక నీవో
కూనలమ్మ పలుకువో కూచిపూడి కులుకువో
కొండపల్లి బొమ్మవో కొండమల్లి రెమ్మవో
కిన్నెరసాని శృంగారానివో నడూరి ఎంకి సింగారానివో
బాపూ బొమ్మలో వయ్యారానివో బాలూ పాటలో నయగారానివో
గోదారి గంగమ్మ వెల్లువ నీవో
వేటూరి పాటకు పల్లవి నీవో
వడ్డది పాపయ్య చిత్రం నీవో
జక్కన్న చెక్కిన శిల్పం నీవో
ఊహలు గీసిన బొమ్మవు నీవు
ఊహకు కవితలు నేర్పించావు

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips