21 July 2010

రాగముతో అనురాగముతో మెల్లమెల్లగ నిదురా రావే

పల్లవి:

రాగముతో అనురాగముతో మెల్లమెల్లగ నిదురా రావే
మెల్లమెల్లగ చల్లచల్లగా రావే నిదురా హాయిగా

చరణం1:

వెన్నెల డోలికలా పున్నమి జాబిలి పాపవై
కన్నులనూగవే చల్లగ, రావే నిదురా హాయిగా
కన్నులనూగవే చల్లగ ,రావే నిదురా హాయిగా
మెల్లమెల్లగ చల్లచల్లగా రావే నిదురా హాయిగా

చరణం2:

పిల్ల తెమ్మెరలా ఊదిన పిల్లనగ్రోవివై
జోలపాడవె తీయగా, రావే నిదురా హాయిగా
జోలపాడవె తీయగా ,రావే నిదురా హాయిగా
మెల్లమెల్లగ చల్లచల్లగా రావే నిదురా హాయిగా

చరణం3:

కలువ కన్నియల వలచిన తుమ్మెద రేడువై
కన్నుల వ్రాలవె మెల్లగా, రావే నిదురా హాయిగా
కన్నుల వ్రాలవె మెల్లగా, రావే నిదురా హాయిగా
మెల్లమెల్లగ చల్లచల్లగా రావే నిదురా హాయిగా
రాగముతో అనురాగముతో మెల్లమెల్లగ నిదురా రావే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips