30 July 2010

అక్షయలింగ విభో స్వయంభో

అక్షయలింగ విభో స్వయంభో
ఆలించుమయ్యా సదాశివ శంభో
శరణంటినయ్యా కరుణమూర్తీ
స్మరణీయ జగదంబికా హృదయాళువై
విత్తమ్మునీయవే విజ్ఞానమీయవే
కృత్తివాసా మమ్ము కృతార్థులను శాంతవే
అభయమ్ము దయసేయు మరలవాసా
శుభ పాదమే నమ్మినాను మహేశా
పూమాలవలె అమరియుండు పెనుపావ
ఏ పారగా జటాజూటమున సొగ సోవా
గళమున విషమట - పెదవుల సుధయ
ఇచ్చువాడు తను బిచ్చగాడట
నిలిచియున్నాడ - కొలుచుచున్నాడ
తలచుచున్నాడ - ననుబ్రోవు మన్నివే

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips