31 July 2010

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే
సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూసానులే
ఏనోము ఫలమో ఏ దేవివరమో నీదాననైనానులే
సిరిమల్లేసొగసూ జాబిల్లివెలుగూ ఈరేయి నీకోసమే
ఓఓ ఒ ఓఓఓ ఓఓ ఒ ఓఓఓ

పానుపు మురుసింది మనజంట చూసీ
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసీ
పానుపు మురుసింది మనజంట చూసీ
వెన్నెల కురిసింది మన ప్రేమ చూసీ
వలచిన ప్రియుని కలిసిన వేళా
వలచిన ప్రియుని కలిసిన వేళా
తనువంత పులకింతలే

సిరిమల్లె సొగసూ
జాబిల్లి వెలుగు
నీలోనే చూసానులే
ఓఓ ఒ ఓఓఓ ఓఓ ఒ ఓఓఓ

దివిలో నెలరాజు దిగివచ్చినాడూ
భువిలో కలువమ్మ చేయ్ పట్టినాడు
దివిలో నెలరాజు దిగివచ్చినాడూ
భువిలో కలువమ్మ చేయ్ పట్టినాడు
నీతోటి చెలిమీ నిజమైన కలిమీ
నీతోటి చెలిమీ నిజమైన కలిమీ
నిలవాలి కలకాలమూ

సిరిమల్లె సొగసూ జాబిల్లి వెలుగు
నీలోనే చూసానులే మ్ మ్ మ్ మ్
సిరిమల్లే సొగసూ జాబిల్లి వెలుగూ
ఈ రేయి నీకోసమే
ఓఓ ఒ ఓఓఓ ఓఓ ఒ ఓఓఓ

No comments: