21 July 2010

నీ ఇళ్ళు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను

పల్లవి:

నీ ఇళ్ళు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
జోరుమీద ఉన్నవు జోడు కడతావా
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా
నీ ఇళ్ళు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
పొంగుమీద ఉన్నవు తోడు పెడతావా
మురిపాల మీగడంత తోడిపెడతావా
ఓ ఓ ఓ గోల్డ్ మేన్
ఓ ఓ ఓ గోల్డ్ మేన్

చరణం1:

బంగారు కొండమీద శృంగార కోటలోన చిలకుంది తెమ్మంటావా
చిలకుంది తెమ్మంటావా
ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట,హారాలకే అగ్రహారాలు రాసిస్తా
అందాల గని ఉంది నువ్వు చూసుకో, నీకందాక పని ఉంటె నన్ను చూసుకో
నీ ఇళ్ళు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను

చరణం2:

వజ్రాలవాడలోన వైడూర్యమంటి నిన్ను వాటేయ వద్దంటావా
వాటేయ వద్దంటావా
వరహాల పందిట్లో విరహాలు నీకేల
రతనాల ముంగిట్లొ రాగాలు తీయాల
మేలైన సరుకుంది మేలమాడుకో
ఓ గీటురాయి మీద గీసి చూసుకో

నీ ఇళ్ళు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను
జోరుమీద ఉన్నవు జోడు కడతావా
మురిపాల మీగడంత తోడిపెడతావా
హ హ హ హ హ హ హ

No comments: