22 July 2010

కంటి చూపు చెపుతోంది కొంటె నవ్వు చెపుతోంది

పల్లవి:

కంటి చూపు చెపుతోంది కొంటె నవ్వు చెపుతోంది
మూగ మనసులో మాట ఓ పిల్లా
కంటి చూపు చెపుతోంది కొంటె నవ్వు చెపుతోంది
మూగ మనసులో మాట ఓ పిల్లా
ఆశలు దాచకు ఆశలు దాచకు
ఆశలు దాచకు ఆశలు దాచకు
కంటి చూపు చెపుతుంది కొంటె నవ్వు చెపుతుంది
మూగ మనసులో మాట ఓ పిల్లా
ఓ పిల్లా

చరణం1:

ఆడపిల్ల పూలతీగే ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్ల పూలతీగే ఒక్కలాగే చక్కనైనవి
ఆడపిల్లా పూలతీగే ఒకలాగే అండ కోరుకుంటాయి
అహా అందమైన మగవాడు పొందు కోరవచ్చాడు
ఎందుకు అలా చూస్తావు ఓ పిల్లా
స్నేహము చేయవా స్నేహము చేయవా

కంటి చూపు చెపుతుంది కొంటె నవ్వు చెపుతుంది
మూగ మనసులో మాట ఓ పిల్లా
ఓ పిల్లా

చరణం2:

కొమ్మ మీద గోరువంక రామచిలక జోడుగున్నదే
కొమ్మ మీద గోరువంక రామచిలక జోడుగున్నదే
కొమ్మ మీదా గోరువంకా రామ చిలక ముద్దు పెట్టుకునాయి
అహా మెత్తనైన మనసు ఉన్నది క్రొత్త చిగురు వేసింది
మత్తులోన మునిగింది ఓ పిల్లా
మైకము పెంచుకో మైకము పెంచుకో

కంటి చూపు చెపుతుంది కొంటె నవ్వు చెపుతుంది
మూగ మనసులో మాట ఓ పిల్లా
ఓ పిల్లా

చరణం3:

చెప్పలేని వింత వింత అనుభవాలు విరగ బూచే
చెప్పలేని వింత వింత అనుభవాలు విరగ బూచే
చెప్పలేని వింత వింతా అనుభవాలు ఎదురు చూస్తునాయి
అహా నువ్వు నన్ను చేరాలి నేను మనసు ఇవ్వాలి
ఎదరులేక ఉండాలి ఓ పిల్లా

కంటి చూపు చెపుతుంది కొంటె నవ్వు చెపుతుంది
మూగ మనసులో మాట ఓ పిల్లా
ఆ వస్తావా మురిపిస్తావా ఆ వస్తావా మురిపిస్తావా
కంటి చూపు చెపుతుంది కొంటె నవ్వు చెపుతుంది
మూగ మనసులో మాట ఓ పిల్లా
ఆ వస్తావా మురిపిస్తావా ఆ వస్తావా మురిపిస్తావా
ఓ పిల్లా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips