21 July 2010

పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం--Chanti

పల్లవి:

పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం

కొడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చరణం1:

తానిచ్చు పాలలో ప్రేమంత కలిపి సాకింది నా కన్నతల్లి
లాలించు పాటలో నీతంత తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు
కలనైన అపకారి కాను
చేసిన పాపముల ఇవి ఆ విధి శాపములా
మారని జతకమా ఇది దెవుని శాసనమా
ఇది తీరేదే కాదా ఆ ఆ

పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
కొడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం

చరణం2:

తాళంటే తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్ళికే రుజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైన ఏదైన జరిగింది ఘోరం నామీద నాకేలే కోపం
నా తొలి నేరమున ఇవి తీరని వేదనలా
నా మది లోపముల ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాధే పోదా

పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం
కొడగట్టిన దీపాలే గుడి హారతులయేనా ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పావురానికి పంజరానికి పెళ్ళి చేసే పాడులోకం
కాళరాత్రికి చందమామకి ముళ్ళు పెట్టె మూఢలోకం

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips