04 December 2010

కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం

కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం,అభిమానం అమ్మకు నాన్నకు శతమానం

కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం,అభిమానం అమ్మకు నాన్నకు శతమానం
అమ్మను వధువుగ చేస్తున్న,వరునిగ నాన్నను చూస్తున్న
కనుపాపలకెంతో ఆహ్లాదం ఈ పాపలకెంతో ఆనందం

ఆ వేదమంత్రాల అర్ధాలు తెలిపి ఆశీర్వదించండి ఈ జంటని
ఆదర్శభావాల ఆంతర్యమెరిగి దీవించి పంపండి ఈ ఇంటికి
మనసు పడే సౌభాగ్యం,మమత అనే మాంగళ్యం
స్త్రీ జన్మ కోరేటి సిరులేగద
స్త్రీ జన్మ కోరేటి సిరులేగద
శివపార్వతులు మాకు మీరేగద
శివపార్వతులు మాకు మీరేగద

కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం,అభిమానం అమ్మకు నాన్నకు శతమానం

ముక్కోటి దేవుళ్ళ ముద్దంత తెచ్చి ముగ్గేసుకోవాలి ఈ ఇంటికి
శతకోటి తారల్ల చిరునవ్వు తెచ్చి హారాలు వెయ్యాలి ఈ జంటకి
సగమైన సహధర్మం కలిసిందే సంసారం
ఏడేడు జన్మాల బంధాలతో
ఏడేడు జన్మాల బంధాలతో
మీజన్మ పండాలి అనురాగమై
మీజన్మ పండాలి అనురాగమై

కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం,అభిమానం అమ్మకు నాన్నకు శతమానం
అమ్మను వధువుగ చేస్తున్న,వరునిగ నాన్నను చూస్తున్న
కనుపాపలకెంతో ఆహ్లాదం ఈ పాపలకెంతో ఆనందం

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips