04 December 2010

మమతల మధురిమ తొలి ఉగ్గులే పట్టనా

మమతల మధురిమ తొలి ఉగ్గులే పట్టనా
జననినై జగమునే ఇక ఊయలే ఊపనా
ఒక అమ్మగ నీకిక అంకితమైపోనా
సుహాసిని సుమాలతోట నీడలో
వసంత గాలిలాగ లాలి పాడనా
మమతల మధురిమ తొలి ఉగ్గులే పట్టనా
జననినై జగమునే ఇక ఊయలే ఊపనా

కడుపున కదలాడే మోడు ఆశే పూలు పూసే
పురుడెరుగని పూవే తోటలోన తొంగి చూసెలే
కలలకు కనులిచ్చే పొద్దులేవో తెల్లవారె
నిరుడెరుగని నేడె కంపించెలే
నాలోనే క్షీర సాగరం పొంగిపోయెలే
ఈనాడే జీవితామృతం చిందిపోయెలే
నాలోనే క్షీర సాగరం పొంగిపోయెలే
ఈనాడే జీవితామృతం చిందిపోయెలే

మమతల మధురిమ తొలి ఉగ్గులే పట్టనా
జననినై జగమునే ఇక ఊయలే ఊపనా

మనుగడ మలుపుల్లో మల్లెపూలే జల్లులాయే
అడవిని పిడిరాయే అమ్మలాగ మారిపోయేలే
అతిధిగ జీవితాన అండగాయె
మనసిక ఒడిచేరే బోసి నవ్వే వెన్నెలాయే
నాలొనే మాతృదేవత కోవెలుందిలే
ఏనాడు ఓడిపోని ఓ అమ్మ వుందిలే
నాలొనే మాతృదేవత కోవెలుందిలే
ఏనాడు ఓడిపోని ఓ అమ్మ వుందిలే

మమతల మధురిమ తొలి ఉగ్గులే పట్టనా
జననినై జగమునే ఇక ఊయలే ఊపనా
ఒక అమ్మగ నీకిక అంకితమైపోనా
సుహాసిని సుమాలతోట నీడలో
వసంత గాలిలాగ లాలి పాడనా

No comments: