07 June 2010

మతమేల గతమేల మనసున్న నాడు.

మతమేల గతమేల మనసున్న నాడు.
హితమేదొ తెలియాలి మనిషైన నాడు.
నీ దేశమే పూవనం. పూవై వికశించనీ జీవితం.

కన్నీట కడగాలి కులమన్న పాపం.
మత రక్త సింధూరం కడగాలి అరుణం.
గాయాల నీ తల్లికీ, కన్నా!! జో లాలి పాడాలి రా!!

సరిహద్దులే దాటు ఆ గాలిలా, ప్రవహించనీ ప్రేమనే హాయిగా,
నదులన్ని కలిసేటి కడలింటిలో, తారల్లు విరిసేటి ఆ నింగిలో,
కలలోకి జారేను ఈ రాత్రులే, వెలిగించె నవ్యోదయం. ( మతమేల గతమేల )

తల ఎత్తి నిలవాలి నీ దెశమూ! ఇల మీదనే స్వర్గమై!!
భయమన్నదే లేని భవితవ్యమూ!! సాధించరా సంభ్రమై!!
ఒక మాట ఒక బాట ఒక ప్రాణమై!! సాగాలిరా ఏకమై!!!

No comments: