ఆ.. ఆ.. ఆ..
కొమ్మలో గుమ్మ కోయిలాలో కుయ్యా కుయ్యా
చెక్కిలే చెమ్మ చెక్కలాల హొయ్యా హొయ్య
గోదావరీ పైయెద కృష్ణమ్మ నీ వాల్ జడా
నిండారె తెలుగింటి అందాలే వెలిగించే
నండూరి వారెంకిలా.. ఓ...
గోదావరి ఎన్నెలా నా దారిలో కాయగా
ఉప్పొంగే పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా ఓ...
సిగ్గల్లే పండెనులే సాయంత్రమూ
బుగ్గల్లో పండాలి తాంబూలమూ |2|
ఎన్నెల్లె కోరుకునే ఏకాంతమూ
నన్నల్లుకోమందీ ఒయ్యారమూ
కౌగిలిలో మేలుకునే కానుకవో మేనకవో
నా స్వప్న లోకాలలో ఓ..
||గోదావరీ||
గువ్వమ్మా చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
కవ్వాలే కడవల్లొ కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో
తుంటరివో తుమ్మెదవో
నా బాహుబంధాలలో ఓ...
||గోదావరీ||
No comments:
Post a Comment