ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిధిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా..
ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిధిలా నను చేరుకున్న హృదయమా
ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా ప్రియతమా ప్రియతమా..
నింగి వీణకేమో నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్ని తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లెమొగ్గ వలపే తెలిపి నాలొవిరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మ కన్న చీరకట్టుకున్న పడుచుతనమే నాలో మురిసే
మబ్బులన్ని వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్ని దాటగానే తగిలే గగనం రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో
అడుగే పడక గడువే గడిచీ పిలిచే
ప్రాణవాయువేదో వేణువూదిపోయే శృతిలో జతిలో నిన్నే కలిసే
దేవగానమంతా ఎంకిపాటలాయే మనసుమమత అన్ని కలిసే
వెన్నెలల్లే వచ్చి వేదమంత్రమాయె బహుశా మనసావాచా వలచి
నేలకన్నే వచ్చి జాణకన్నె మారే కులము గుణమూ అన్నీ కుదిరి
నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
No comments:
Post a Comment