14 June 2010

కొంచం కారంగా కొంచం గారంగా

పల్లవి:
కొంచం కారంగా కొంచం గారంగా
కొంచం కష్టంగా కొంచం ఇష్టంగా
అందించనీ అదిరే అధరాంజలి
బంధించనీ కాలాన్నీ కౌగిలి
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలి
మంటల్లే నను మరిగించాలి


చరణం:
తలుపేసుకుంటె నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటె స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నరనరమునా
ఇక నా వశము కాకుంది యమ యాతనా
లేనిపోని నిందలుగాని హాయిగానె ఉందీ హానీ
ఉన్నమాట నీతో చెప్పనీ
||కొంచం కారంగా||

చరణం:
అమ్మాయినంటూ నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టు గుండెల్లోకే చూస్తూ
నీ గాలి కబురొచ్చి మునివెచ్చగా
నువ్వేమేమి చేస్తావొ చెబుతుండగా
మనసకంది మన్మధ లేఖ కెవ్వుమంది కమ్మని కేకా
వయసు కందిపోయే నేడిలా
||కొంచం కారంగా||

No comments: