03 June 2010

హాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్‌రా

హాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్‌రా
సరదాగా జగమంతా చుట్టేసెయ్‌రా
హాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్‌రా
సరదాగా జగమంతా చుట్టేసెయ్‌రా
సిల్లి జోకులు వేసుకో గిల్లికజ్జా పెట్టుకో
లోన్లిగ పేకలు ఆడుకో బుల్లి రొమాన్సులు చేసుకో
మేరియార్........ మేరియార్....... ||హాపీగా||

ఓ.... కావ్యనాయకి కేమెరాతో కన్నుకొట్టని కేరింతల పన్ను కట్టని
ఓ.... నేలజాబిలి గుణపాఠం నీకు నేర్పని ఇరకాటం నన్ను పెట్టని
పూటకో దేశం బుజ్జి భూగోళం
పికినికానందం పిల్లగోవిందం
నత్త నడకలే ఆగనీ కొత్త పరుగులే సాగనీ
సత్తువేమిటో తేలనీ బంతిపువ్వులై నవ్వని
జోరుకు జోరు ప్రపంచ టూరు ప్రేమ నైటింగేల్
మేరియార్........ మేరియార్....... ||హాపీగా||

ఓ.... బొద్దుగోపిక నీపద్ధతి భేషు భేషిక నాహద్దులు స్మాషు చెయ్యగా
ఓ.... గైడు సుందరా హంగామా చాలుచాలురా హైడ్రామా చెల్లబోదురా
పుచ్చుకో మద్యం పూటకో పధ్యం
దాచుకో స్వర్గం మనసు నీమార్గం
మత్తురేపు నీకళ్ళకి మైకమెందుకే ప్రేయసి
పొత్తుకుదిరితే ప్రేమకి లోకమెందుకే రోదసి
రోజుకి రోజు మరింత మోజు ప్రేమ డింగ్ డాంగ్ బెల్
మేరియార్........ మేరియార్....... ||హాపీగా||

No comments: