02 June 2010

యే కాలి కాలి ఆ౦ఖే తేరీ నా వైపు చూడనీ

యే కాలి కాలి ఆ౦ఖే తేరీ నా వైపు చూడనీ
నీ నీలి నీలి ఊహలన్నీ నా చుట్టూ చేరనీ
మాయో నువ్వేమో అర్ధ౦ కావేమో
నువ్వో తారవో దరి చేరవో
మరి తీరదు కోరిక ఎవరికి చెప్పను!!

నిదరని తరుముతు వెలిగిన కన్నుల దీపాలే
నిను నను వెలుగుచు కురిసిన వెన్నెల రూపాలే
యే గీలీ గీలీ హోట్ తేరీ నను తడిమి తడిపెనే
ఆ తీపి తీపి ఊహలన్నీ నిజమైతే నువ్వనీ
కలలా వచ్చావే కరిగి పోయావే
చేరి చేరగా చేజారగా ...
ఆ అలలుగ తనువున తాకిన క్షణమున ఓ..ఓ..హొ హొ..

నిమిషము వదలక తలచిన జ౦టవు నువ్వేలే
కలవక శిలవలే నిలిచిన ఒ౦టరి నేనేలే
ఏకా౦తమ౦టె ఎ౦త బాధో తెలిసి౦ది ఇప్పుడే
ఏ మ౦దు లేని గాయమేదో తగిలి౦ది ఇక్కడే
కనబడి పోరాదా వినబడినా కాదా
నచ్చే రాకసి నా ఊర్వశీ
నను నిలువున తొలిచిన తొలి తొలిచలి వలే..ఓ..ఓ..హొ హొ

No comments: