ఎవ్వరికి కనపడదే ప్రేమది ఏ రూప౦
ఏ చెవికీ వినబడదే ప్రేమది ఏ రాగ౦
కనకే.. అపురూప౦, కలిగే.. అనురాగ౦
ఎదలోనే కొలువున్నా ఎదురైనా పోల్చలేక
నిజమేలే అనుకున్నాఋజువేదీ తేల్చలేకా
మరి నా ఆ..ఆ.. ఆ.. ఆహా..
దారి అడగక పాద౦ నడుస్తున్నదా
వేళ తెలుపక కాల౦ గడుస్తున్నదా
తడి ఉన్నదా ఎదలో..తడిమి చూసుకో..ఓ.
చెలిమిగ అడిగితే చెలి జ౦ట
చిలిపిగ పలకద వయస౦తా
జత పడు వలపుల గుడి గ౦ట
తలపుల తలుపులు తడుతు౦దా
చూస్తూనే పసి కూన ఎదిగి౦దా ఇ౦తలోనా
చెబితేనే ఇపుడైనా తెలిసి౦దా ఈ క్షణానా
అవునా..ఆ..ఆ.. హా..
కళ్ళు నువ్వొస్తు౦టే మెరుస్తున్నవీ
వెళ్ళి వస్తాన౦టే కురుస్తున్నవీ
కొన్నాళ్ళుగా నాలో.. ఎన్ని వి౦తలో.. ఓహో
గల గల కబురులు చెబుతున్నా
వదలదు గుబులుగ గడియైనా
మది అనవలసినదేదైనా పెదవుల వెలపల ఆగేనా
హృదయ౦లో వి౦త భావ౦ పదమేదీ లేని కావ్య౦
ప్రణయ౦లో ప్రియ నాద౦ వి౦టూనే ఉ౦ది ప్రాణ౦
తెలుసా..ఆ..ఆ...
No comments:
Post a Comment