03 June 2010

చందమామ రావో జాబిల్లి రావో

ఆ...

చందమామ రావో జాబిల్లి రావో
సందెవేళ దాటిపోయే ఎందుదాగినావో

చెలియ కలువ ఒంటరిదాయే నీవు తోడు రాకా
చెలువమంత తుంటరిదాయే నీదు జాడలేక
కాచిన కనులే కాయలు కాచే
వేచిన ఎదలో వేసవి తోచే
పున్నమి స్వరములు పులకల వరములు చిలుకరించిపోవో

ఆ..ఆ..

చుక్క కన్నె గుబులుగ దాగే నీవు కానరాకా
హృదయ వీణ బరువుగ మోగే నీవు చెంతలేకా
మేఘమాల మాటుగ నేడు దాగెదవేలా
రాగమాల మీటగ పిలువ ఆగెదవేలా
బిగువే వదిలి దయగనవా

No comments: