22 June 2010

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ

పల్లవి:
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురూ
కోటి పడవలో విన్నది కొత్తపెళ్ళికూతురు
||ఎదో ఏదో||

చరణం:
ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే ఒయ్యారం
ముడుచుకునే కొలది మరీ మిడిసిపడె సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలి
||ఏదో ఏదో||

చరణం:
నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసిగేరూ
పులకరించు మమతలతో పూలపాంపు వేశారు
||ఏదో ఏదో||

No comments: