ఆ పూల రంగూ..నీ చీర చెంగూ
రాశాయి నాలో గీతాలు ఏవో..
నే పాడుకుంటాను లే.. రాగాల లోగిళ్ళలో..
అనురాగాల వాకిళ్ళలో..
ఓ తేనె దొంగా నా సామి రంగా
పుట్టాను నీకై పూశాను పువ్వై
నీ వెంట ఉంటాను లే.. నీ దాననౌతాను లే..
మరి నీ లోని గీతాన్ని లే..
పసుపుగ విరిసిన పువ్వులూ
తలపై కురిసెను పలికెను
ఉండాలనీ పచ్చగా..
ఎఱ్ఱగ విరిసిన పువ్వులూ..
తలపై కురిసెను పలికెను
ఉండాలనీ ప్రేమతో..
ఆ రంగు తోటీ ఈ రంగు కలిసే..
నీ కాళ్ళ పారాణి గా ఆ ఆ
నా కళ్ళ లో రాణి గా..
నా కళ్ళ లో రాణి గా..
ఓ తేనె దొంగా నా సామి రంగా
పుట్టాను నీకై పూశాను పువ్వై
నే పాడుకుంటాను లే.. రాగాల లోగిళ్ళలో..
అనురాగాల వాకిళ్ళలో..
కలసిన కనులకు తెలియును
తలపుల మలపుల సొగసులు
ఈ ప్రేమ భంధాలెవో..
నడచిన అడుగులె కలుపును
మనసును మనసును ఒకటిగా
ఏ రాగ బంధాలివో..
ఆ బంధమేదో అనుబంధమేదో..
పాడాలి భూపాలమై...
అందానికే మూలమై..
అందానికే మూలమై..
ఆ పూల రంగూ..నీ చీర చెంగూ
రాశాయి నాలో గీతాలు ఏవో..
నే పాడుకుంటాను లే.. హోయ్ రాగాల లోగిళ్ళలో..
అనురాగాల వాకిళ్ళలో..
No comments:
Post a Comment