07 June 2010

ఫెళ ఫెళమని ఉరిమిన వేళ .. నువ్వే గుర్తొస్తావు

ఫెళ ఫెళమని ఉరిమిన వేళ .. నువ్వే గుర్తొస్తావు
తొలకరి చినుకులు కురిసిన వేళ .. నువ్వే గుర్తొస్తావు
హరివిల్లు కనపడిన వేళ .. నువ్వే గుర్తొస్తావు
గుసగుస గాలులు వీచిన వేళ .. నువ్వే గుర్తొస్తావు
నువ్వే గుర్తొస్తావు .. గుర్తొస్తావు .. గుర్తొస్తావు ! '

చిట్టి చిలకవో .. చందమామవో
(అందమైన చందమామ అందుకుంటే అందుతుంద
నేలకొచ్చి వాలుతుంద .. నీకు పిచ్చి పట్టుకుందా?)
మెరుపు తీగవో .. చిలిపి తారవో
మెరిసే మేఘం కురిసేదెప్పుడో
కురిసే వర్షం వెలిసేటప్పుడే
ముసురుకున్నదీ ఏదో చిలిపి కోరికా
ముదరనివ్వకూ కధలే చాలు చాలికా

చిట్టి చిలకవో .. చందమామవో
మెరుపు తీగవో .. చిలిపి తారవో

మెరిసే .. తొలకరిలో .. నిను కనులారా చూశా
చలిలో .. గిలిగిలిలో .. కొసమెరుపులు ఆరేశా

ముసిరే గాలివానలలో .. ముదిరే ముద్దు పిలుపులలో
తడిసే వాన చినుకులలో .. పడకూ మత్తు కవితలలో

వాన విల్లు ఏడు రంగులే చిలికే .. కన్నె పాప వేడి పొంగులే
ఊహలోన ఊయలూగితే తమకూ .. దిక్కు ఇంక ఎండమావులే
ఆడపిల్ల మాటలే ఆందమైన మాయలే
అర్ధమైతె చాలులే అంతకంత హాయిలే

చిట్టి చిలకవో .. చందమామవో
మెరుపు తీగవో .. చిలిపి తారవో

ఉరికే .. వయసులలో .. తొలి గిలిగింతల వానా
చినుకే .. చిటపటగా .. దరువేసెను మదిలోనా

కనులే గీటు మబ్బులకే .. కసిగా ఉంది ఉరుములతో
గొడవే కాస్త ముదిరెనులే .. గొడుగే పట్టు వయసులలో

వానదేవుడొచ్చినప్పుడే వయసే .. మొక్కు తీర్చుకోక తప్పదూ
చినుకు తేలు కుట్టినప్పుడే జతగా .. మంత్రమేసుకోక తప్పదూ
కుర్రకారు జోరులో కోతలింక మానుకో
దారితప్పకుండ నువ్వు వళ్ళు దగ్గరుంచుకో

చిట్టి చిలకవో .. చందమామవో
మెరుపు తీగవో .. చిలిపి తారవో

మెరిసే మేఘం కురిసేదెప్పుడో
కురిసే వర్షం వెలిసేటప్పుడే
ముసురుకున్నదీ ఏదో చిలిపి కోరికా
ముదరనివ్వకూ కధలే చాలు చాలికా

చిట్టి చిలకవో .. చందమామవో
మెరుపు తీగవో .. చిలిపి తారవో

No comments: