నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా తెలిసీ తెలియని ఆశల వయాసీ వరసా
యేటిలోని అలలవంటి కంటిలోని కలలు కదిపి గుండియెలను అందియలుగ చేసీ
||తకిట||
కంటి పాపకు నేను లాల పోసే వేళ చంటి పాప..చంటి పాప నీకు లాలినౌతానంది
ఉత్తరాన చుక్క ఉలికి పడతా ఉంటే చుక్కానిగా నాకు చూపు అవుతానంది
గుండెలో రంపాలు కోత పెడతా ఉంటే పాత పాటలు మళ్ళీ పాడుకుందామంది
సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు
అన్నదేదో అంది ఉన్నదేదో ఉంది
తలపైనా గంగా తలపులో పొంగింది
ఆది విష్ణు పాదమంటి ఆకశాన ముగ్గు పెట్టి
జంగమయ్య జంట కట్టి కాశిలోన కాలు పెట్టి
కడలి గుడి కి కదలి పోయే గంగా
||తకిట||
No comments:
Post a Comment