కళ్ళలో నువ్వే నువ్వే
నా కలలో నువ్వే నువ్వే
మనసులో నువ్వే నువ్వే
ప్రతి మాటలో నువ్వే నువ్వే
ఎదుట పడిన ప్రతి వారిలోన నిను చూసానా
నీవు తప్ప జనులెవరు లేరా ఈ లోకానా
తేల్చవా నువ్వే
నిన్నంత నిదుర లేదు నీ వల్ల
అంత లేనిపోని నిండలా
హేయ్ నన్నింక వదలంటు పంతాల
లేనే లేనె చుట్టు పక్కలా
రేయంతా ఊహల్లో నీవు లేవా నిజం వొప్పుకో
చీకట్లో ఏమి చూసావో నన్నేనా గుర్తు చేసుకో
జ్యోతుల్లా మారిన చూపుల్లో
నీ రూపు సాక్ష్యం గా చూపనా
నీలాల నీ కంటి పాపల్లో
బంధించుకున్నావా నన్నిలా చెలిమి సంకెలా
క్షేమంగా ఉంది కదా నా మనసు
నాకు మాత్రం యేమి తెలుసు
నీకు కాక యెవరికెరుక దాని ఊసు
కంట చూడలేదె అసలు
యేనాడో నా చేజారి వెళ్ళిందే నిన్ను చేరగా
యే గలిలో తేలుతుందో నా దాకా చేరలేదుగా
గుమ్మల్ని దాటెది ఎప్పుడూ
యేమైందో అంతేగా ఇప్పుడూ
ఆచూకి తెలిసినప్పుడూ
నీ కప్పగిస్తానే అమ్మడూ నన్ను నమ్మవే
No comments:
Post a Comment