తిడతారా కొడతారా ఎవరైనా ఎపుడైనా
స్థిరంలేని ఈ శివాలెందుకని నిందిస్తారా బంధిస్తారా
హడావుడిగ పడిలేచే కడలి అలని
బలాదూరు తిరిగొచ్చే గాలితెరని
అదేపనిగ పరిగెత్తేవెందుకని
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది
కృష్ణా ముకుందా మురారే
నిష్టూరమైనా నిజం చెప్పమన్నారె
ఇష్టానుసారంగ పోనీరే
సాష్టాంగ పడి భక్తి సంకెళ్ళు కడతారె
నీ ఆలయానా గాలి ఐనా ఈల వేసేనా
ఏ కేళికైనా లీలకైనా వేళ కుదిరేనా
దేవుళ్ళాగ ఉంటే ఫ్రీడం అంత సులువా
ఆవారాగ నువు ఆనందించగలవా
ఉస్కో అంటు నువు ఉడాయించుమరి
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది
శ్రీరాముడంటుంటె అంతా
శివతాండవం చేస్తె చెడిపోదా మరియాద
మతిమరుపు మితిమీరి పోకుండా
అతిపొదుపు చూపాలి నవ్వైన నడకైన
ఈ ఫ్రేముదాటి పైకి వస్తే లోకువైపోవా
నీ పరువుమీదా పదవిమీదా భజనలైపోవా
చిరాగ్గుంటె ఈ మరీ పెద్దతరహా
సరె ఐతే విను ఇదో చిన్న సలహా
పరారైతె సరి మరో వైపు మరి
అదిగో అలాగ అదుపే తెలీక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నదిహోరులాగ పలికే పదం ఇది
No comments:
Post a Comment