విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే
విన్నానులే ప్రియా
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే
ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే
ఒదిగి ఉన్నావులే
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే …
విన్నానులే ప్రియా
వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము
వికసించి వెలిగే నీ అందము ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు … కాముడు దాగిన పొదరిళ్ళు
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే
నిండి ఉన్నావులే
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే
విన్నానులే ప్రియా
చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల
చిరుగాలి వీచెను వింజామర గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు
ఆ పసిడి పందిళ్ళలో మనకె పరిణయమౌనులే
పరిణయమౌనులే
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే
విన్నానులే ప్రియా
No comments:
Post a Comment