03 June 2010

కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా

||పల్లవి||
కథలో రాజకుమారి ప్రేమగమారి పిలిచేరా.........
ఇలలో రాజకుమరుడు రాజసవీరుడు నిలిచేరా........
హ్రుదయములోని మనసును రేపీ....... బ్రతుకులలోని తీపిని చూపీ.........
కొవెలమ్మ మెట్టు, ప్రేమ ఒట్టు, గట్టు చూపెట్టితీరేట్టు........ ||కథలో||

||చరణం 1||
ఆలయమందున్నది......... ఆరిపోనట్టి ప్రేమేరా..........
ఆకాశము నేల ఒకటై వచ్హేసి ఆశీస్సులిచ్హేనురా
ప్రేమొక పిచ్హిదిరా........ ప్రాణమిచ్హేంత మంచిదిరా.........
చెయ్యెత్తి మొక్కంగ జేగంట కొట్టంగ ఆ ప్రేమ అందేనురా
కొరుకున్న కోరికలూ........సాగిపోవు దీపాలు...........
చేరువగును చేరికలూ......తీరిపొయి శాపాలు............
శుభకరములు, తన కరములు వరమాలై అల్లేరా......... ||కథలో||

||చరణం 2||
శ్రావణ మూర్తాలలో......... ప్రేమ ప్రమిదలు వెలిగేరా.........
తాళాలు రేగంగ, మేళాలు మోగంగ మాంగల్యధారణరా
బంగరు మేఘలురా.....రంగు పందిళ్ళు వేసేరా.........
కళ్ళకు దిద్దందగ ఆ నీలి మేఘం కాటుక అయ్యేరా...........
తార బొట్టు పెట్టేను........తాళిబొట్టు అల్లేను........
నింగి వేదికేసేను....... చూడ వేడుకయ్యేను.......
వెయ్యొత్తుల దీపాలతో ఇక పెళ్ళే జరిగేరా.............. ||కథలో||

No comments: