ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగే వారెవ్వరో.. ఈ పాపాలు కడిగే దిక్కెవరో...ఎవ్వరో
అందెలు సందడి చేసిన జాతరలో
ఆకలేసి ఏడ్చిన పసి కందులు
అందం అంగడికేక్కిన సందులలో
అంగలార్చి ఆడిన రాబంధులు
ఎందుకో ఈ చిందులు ..ఎవరికో ఈ విందులు
ఏమిటో ఏమిటో..ఏ ధర్మం ఇది న్యాయం అంటుందో
ఏ కర్మం ఈ గాయం చేసిందో
ఏమిటో ... ఆ ధర్మం ఏమిటో
శీలాలకు శిలువలు ... కామానికి కొలువులు
కన్నీటి కాలువలు..ఈ చెలువలు
కదులుతున్న ఈ శవాలు .. రగులుతున్న స్మశానాలు
మదమెక్కిన మతి తప్పిన నర జాతికి నందనాలు
ఎప్పుడో ఎప్పుడో ఈ జాతికి మోక్షం ఇంకెప్పుడో
ఈ గాధలు ముగిసేది ఇంకెన్నడో
ఎన్నడో.. మోక్షం ఇంకెప్పుడో
అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో ...
మీల మాడిన నవ్వులు ఈ మల్లియలు
కుక్కలు చింపిన విస్తరి తీరులలో
ముక్కలైన బ్రతుకులు ఈ పువ్వులు
ఎందరికో ఈ కౌగిల్లు...ఎన్నాళ్ళో ఈ కన్నీళ్లు
ఎక్కడ ఎక్కడ ఏ వేదం ఇది గోరం అన్నదో
ఏ వాదం ఇది నేరం అన్నదో ..
ఎక్కడో ఆ వేదం ఎక్కడో
ఈ మల్లెల దుకాణాలు
ఈ గాన భాజానాలు
వెదజల్లిన కాగితాలు
వెలకట్టిన జీవితాలు
వల్లకాటి వసంతాలు
తడ్తున స్వగతాలు
గట్లు తెగిన దాహాలకు తూట్లు పడిన దేహాలు
ఎక్కడో ఎక్కడో ఈ రాధల బృందావనం ఎక్కడో
ఈ బాధకు వేణుగానం ఎన్నడో
ఎన్నడో ..ఎక్కడో .. ఎప్పుడో
No comments:
Post a Comment