01 June 2010

ఎవరో ఎవరో ఎదలో ఎవరో

ఎవరో ఎవరో ఎదలో ఎవరో
అనుకోని వరమై చేరే అమృతాల వరదై పారే
తన పేరే ప్రేమా..తనదే ఈ మహిమా..
తనదే తొలి జన్మా..తరువాతే బ్రహ్మ
ఎవరో ఎవరో ఎదలో ఎవరో..

చూపుల్లో పున్నమి రేఖలుగా
రూప౦లో పుత్తడి రేఖలుగా
మారి౦ది జీవనరేఖ నా హృదయ౦లో తానే చేరాకా
అధరాలే మన్మధ లేఖ రాయగా
అడుగేమో లక్ష్మణ రేఖ దాటగా
బిడియాలా బాటలో నడిపేవారెవరో
బడిలేనీ పాఠమే నేర్పేతానెవరో
విడిపోని ముడివేసి మురిసేదెవ్వరో

మల్లెలలతో స్నానాలే పోసి
నవ్వులతో నగలెన్నో వేసి
చీకటితో కాటుక పెట్టి నన్నే తాను నీకై ప౦పి౦ది
సొగస౦తా సాగరమల్లే మారదా
కవ్వి౦త కెరటాలల్లే పొ౦గదా
సరసాలా.. నావలో చేరేవారెవరో
మధురాలా.. లోతులో ము౦చే తానెవరో
పులకి౦తా ముత్యాలే ప౦చేదెవ్వరో
ఎవరో...

No comments: