01 June 2010

కిన్నెరసాని వొచ్చిందమ్మ

చమక్కు చమక్కు ఝింఝిన్న్న ఝింఝిన్న
చమక్కు చమక్కు ఝిన్న ఝిన్న ఝిన్న

ప:కిన్నెరసాని వొచ్చిందమ్మ వెన్నెల పైటేసి
కిన్నెరసాని వొచ్చిందమ్మ వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేన చినుకై
కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
పచ్చనిచేల పావడ కట్టి పచ్చనిచెల పావడ కట్టి
కొండమల్లెలే కొప్పున పెట్టి వచ్చె దొరసాని
మా వన్నెల కిన్నెరసాని

చ:యెండల్లకన్నె సోకని రాణి
పల్లెకు రాణి పల్లవపాణి
కోటను విడిచి తేటను విడిచి
కోటను విడిచి తేటను విడిచి
కన్నులా గంగ పొంగేవేళ
నదిలా తానే సాగేవేళ
రాగాల రాదరి పూదారి అవుతుంటె
ఆ రాగాల రాదారి పూదారి అవుతుంటె

చ:మాగాణమ్మ చీరలు నేసే
మలెసందెమ్మ కుంకుమ పూసే
మువ్వలబొమ్మ ముద్దుల గుమ్మ
మువ్వలబొమ్మ ముద్దుల గుమ్మ
గడపా దాటి నడిచె వేల
అదుపె విడిచి యెగిరే వేల
వయ్యరి అందాలు గోదారి చూస్తుంటె
ఈ వయ్యరి అందాలు గోదారి చూస్తుంటె

No comments: