అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా...||అందాలమ్మా||
ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా ||2||
సిత్తరాలు చూపించాలమ్మా
అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా...||అందాలయ్య||
సన్నజాజి రమ్మంటుందీ సందె పొద్దు సయ్యంటుందీ.. ||2||
ఆశలన్నీ నువ్వే కన్నయ్యా...
||అందాలమ్మా||
చూపూ చూపూ చేరాలీచోటా రోజూ మోజూ తీరాలీపూటా
నీలో నేను నిండుగ నిండాలి నీతో నేనూ నీడగ సాగాలి
పాడాలి ముచ్చట్లే పసిడి తలపు తలుపు తెరచి
కొట్టాలి చప్పట్లే మూగ మనసు ఆద మరిచి..
చిందాలి సందళ్ళే చిలిపి చిలిపి వలపు చినుకు
వెయ్యాలి బంధాలే నింగీ నేల నిలుచు వరకు
ఆయోగం నాదీ అనురాగం నీదీ అదే అదే పదే పదే నా గుండె కోరేది
||అందాలమ్మా||
పూచే పువ్వు నీలా నవ్విందీ.. పోంగే తేనే నాదేనంటుందీ..
పారే వాగు నీలా దూకిందీ రేగే జోరూ నాదే నంటూందీ..
చూడాలి చూపుల్లో గడుసు వయసు సొగసులన్నీ
తీరాలి నవ్వుల్లో దుడుకు మనసు ఛణుకులన్నీ
చూసానూ నీలోనూ కన్నుల ఎరుపు కలల మెరుపు
విన్నాను నీలోను మమత తెలుపు మనసు పిలుపు
ఇంకెందుకంటా ఈ వాదులాట అంతే చాలు అంతే చాలు నా పంట పండిందీ
||అందాలమ్మా||
No comments:
Post a Comment