22 June 2010

ఇవ్వాళ నా పిలుపు.........

||పల్లవి||
ఇవ్వాళ నా పిలుపు.........
ఇవ్వాలి మీకు గెలుపు.....
సంవత్సరం వరకు........ ఓ లోకమా....ఓ...... ||ఇవ్వాళ||

||చరణం 1||
కొంచెం తీపి..... కొంచెం పులుపు....
పంచే ఆ ఉల్లాసమూ.......
కొంచెం కారం..... కొంచెం ఉప్పు....
పంచే ఆ ఆవేశమూ.......
చేదు వగరు చేసే మేలు సమంగా ఆస్వాదించమనీ.....ఓ...... ||ఇవ్వాళ||

||చరణం 2||
ప్రతి క్షణము..... ఒక్కో వరమై.......
సుఖాలే ఇవ్వాలని......
ప్రతి మనసు..... ఒక్కో స్వరమై.......
సంగీతం అవ్వాలని......
పల్లవించే పరిచయాలే స్నేహాలై వికసించాలి అని.....ఓ...... ||ఇవ్వాళ||

No comments: