ఓ....ఓ.....
చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట విన రావమ్మా
ఓ...ఓ......
మరుమల్లెలలో మావయ్యా మంచి మాట శెలవీవయ్య
పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు
నీ చిరునవ్వుకు సరిగావమ్మా ఓ...ఓ....
ఓ...ఓ....
చిగురాకులలో చిలకమ్మా
ఎవరన్నారో ఈ మాటా వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేల ఆ...ఆ....
ఓ....ఓ...
మరుమల్లెలలో మావయ్యా
వలచే కోమలి వయ్యారాలకు తలచే మనసుల తీయదనాలకు
కలవా విలువలు శెలవీయ ఓ...ఓ.....
ఓ...ఓ....
చిగురాకులలో చిలకమ్మా
పై మెరుగులకే భ్రమపడకయ్య మనసే మాయని సొగసయ్య
గుణమే తరగని ధనమయ్యా మ్మ్మ్..మ్మ్....
ఓ....ఓ...
మరుమల్లెలలో మావయ్యా మంచ్ని మాట శెలవీవయ్య
ఓ...ఓ....
చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట విన రావమ్మా
No comments:
Post a Comment