చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకూ
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకూ
చదువు రాని వాడవని దిగులు చెందకు
మంచు వంటి మల్లె వంటి
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
జీవించలేని పనికిరాని బతుకులేందుకూ... ||చదువు రాని వాడవని||
ఏమి చదివి పక్షులు పైకేగరగలిగెనూ...
ఏ చదువు వల్ల చేప పిల్లాలీదగలిగేనూ..
ఏమి చదివి పక్షులు పైకేగరగలిగెనూ...
ఏ చదువు వల్ల చేప పిల్లాలీదగలిగేనూ..
అడవిలోనీ నేమలికెవడు ఆటనేర్పేను
అడవిలోనీ నేమలికెవడు ఆటనేర్పేను
కొమ్మపై కోకిలమ్మకేవరు పాట నేర్పేను ||చదువు రాని వాడవని||
తేలివిలేని లేగ దూడ పిలుచును అంబా అని
ఏమి ఏరుగని చంటి పాప ఏడ్చును అమ్మ అని..
తేలివిలేని లేగ దూడ పిలుచును అంబా అని
ఏమి ఏరుగని చంటి పాప ఏడ్చును అమ్మ అని..
చదువులతో పని ఏమి హ్రుదయమున్నా చాలు
చదువులతో పని ఏమి హ్రుదయమున్నా చాలు
కాగితం పులూ కన్న గరుకపువ్వు మేలు ||చదువు రాని వాడవని||
No comments:
Post a Comment