11 June 2010

ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా

ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
ఓ ప్రేమా నుదుటమీద కావమ్మా కుంకుమా
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా

అసలెందుకే ఆ అమృతమే అనురాగముతో నువు నవ్వితే
రతి సుందరిలా దరిచేరితే
చెలి రేగిపోయే యవ్వనమే ఒక కోరికతో మాటాడితే
కొస చూపులతో తాకితే
మేను మేను ఆని తేలి సోలిపోనీ
ఏది ఏమి కాని ఏకమవ్వని
రా మరి నా చెలీ
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా

షెహనాయి మోగే కోవెలలో శశి కాంతులతో నను చేరుకో
గృహ దేవతవై ఒడి చేర్చుకో
రతనాలు పండె నీ జతలో సుఖ శాంతులతో శృతి చేసుకో
ప్రియ లాలినిలా ఏలుకో
లోకమందు లేని హాయి అందుకోనీ
కోటి జన్మలన్ని తోడు ఉండనీ
రా మరి నా చెలి
ఓ ప్రేమా హృదయ వీణ నీవమ్మా ప్రాణమా
ఓ ప్రేమా నుదుటమీద కావమ్మా కుంకుమా
పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెలా
చేరుమా చైత్రమా స్నేహమా

No comments: