07 June 2010

ఇపుడే కనుగొన్నా

ఇపుడే కనుగొన్నా
వేరెవరో ఈ గుండెల్లో
చేరే ఒక వింతే
ఈ సమయాన

అడుగే వేస్తున్నా
ఆవైపే ఎవరేమన్నా
తనలో నా లోకం చూస్తున్నానా

చూపులకు నిజంగా..., తోచినది కలేనా...
మాటలను స్వరంగా..., మార్చినది తనేనా....

అపుడే నేను నానుంచి వేరైపోయానా...

ఏదో నేనిలా..., ఉన్నా గాలిలా...
నీలో చేరనీ..., శ్వసయ్యేలా...

నిన్న మొన్నలో..., లేదే యే కలా....
నాలో ఈ క్షణం..., తోచే నీలా...

ఇక నా మనసు నా మాటే వినదే ఈవేళ..

సాగే జీవితం..., ఎవ్వరికైనా...
నూరేళ్ళేననీ.., నేనూ విన్నా...

నీతో పాటుగా.., నీడై సాగితే...
ఆయువు తీరునా..., వెయ్యేలైనా...

మనపాదాలు కడదాక స్నేహం చేసేనా.......

No comments: