ఎదో తెలియని బంధమిది ఎదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది ఎదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది ఎదో తెలియని బంధమిది
పూజకు నోచని పూవును కోరి వలచిన స్వామివి నువ్వేలే
రూపంలేని అనురాగానికి ఊపిరి నీ చిరునవ్వేలే
కోవెలలేని కోవెలలేని దేవుడవో గుండెల గుడిలో వెలిసావు
పలికే దీవెన సంగీతానికి వలపుల స్వరమై ఓదిగావు
తనవు మనసు ఇక నీవే
ఎదో తెలియని బంధమిది ఎదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది ఎదో తెలియని బంధమిది
వేసవి దారుల వేసటలోన వెన్నెల తోడై కలిసావు
పూచే మల్లెల తీగకు నేడు పందిరి నీవై నిలిచావు
ఆశలు రాలే ఆశలు రాలే శిశిరంలో ఆమని నీవై వెలిసావు
ఆలుమగలా అద్వైతానికి అర్ధం నీవై నిలిచావు
తనవు మనసు ఇక నీవే
ఎదో తెలియని బంధమిది ఎదో తెలియని బంధమిది
ఎదలో ఒదిగే రాగమిది ఎదో తెలియని బంధమిది
No comments:
Post a Comment