నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని

ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ, నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి నేనేనని
పెదవుల పైనే వుండాలని పదములు ఎన్నో పాడాలని
కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి
పైనే వుండాలని పదములు ఎన్నో పాడాలని
బృందావనం తగదనీ అందరితో తగువనీ
బృందావనం తగదనీ అందరితో తగువనీ
యమున దాటి వెళ్ళాలని వేచివున్న వెర్రిదాన్ని
నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ, నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ
సీతమ్మంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని

పగలు పగలు అనుకుని రాత్రి రాత్రి కలగని
పగలు పగలు అనుకుని రాత్రి రాత్రి కలగని
కలే నిజం అవుతుందని కాచుకున్న పిచ్చివాణ్ణీ
నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ, నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ
ఆహాహాహా హాహాహహా
ఆహాహాహా హాహాహహా
No comments:
Post a Comment